KDP: మైదుకూరు మండలం మిట్టమానుపల్లి గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. ముగ్గురు రైతులకు చెందిన పొలాల్లో ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి లోపల ఉన్న రాగి వైర్లు ఎత్తుకెళ్లారు. పొలాల్లో దొంగలు ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడంతో రైతులు లబోదిబో మంటున్నారు. పోలీస్ అధికారులు దొంగలను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.