»Casting Call For The Most Anticipated Ramcharan Rc16 Movie
RC16: బంపర్ ఆఫర్..రామ్ చరణ్‌తో నటించే ఛాన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో నటించాలనేది చాలా మంది నటీనటుల డ్రీమ్. అలాంటి వారికోసం బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు బుచ్చిబాబు. ఆర్సీ 16 కోసం క్యాస్టింగ్ కాల్ ఇచ్చాడు. మరి చరణ్‌తో ఛాన్స్ అందుకోవాలంటే ఏం చేయాలి.
Casting call for the most anticipated ramcharan RC16 movie
ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ramcharan). ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ రోజు రోజుకి డిలే అవుతునే ఉంది. ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా రీసెంట్‌గానే క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత మార్చి నుంచి బుచ్చిబాబు(buchi babu) సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు చరణ్. ఇప్పటికే బుచ్చిబాబు ఎప్పుడో స్క్రిప్టు రెడీ చేసుకొని.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. మెయిన్ కాస్టింగ్ కూడా దాదాపుగా ఫైనల్ అయిపోయిందని అంటున్నారు. అయితే ఇప్పుడు మిగతా క్యాస్టింగ్ కోసం కాస్టింగ్ కాల్ ప్రకటించారు.
ఉత్తరాంధ్రా యాసలో తెలుగు మాట్లాడగలిగి యాక్టింగ్ వస్తే చాలు.. అన్ని వయసుల వారీగా తమ ప్రొఫైల్స్‌ను పంపించాల్సిందిగా కోరారు. ఆడిషన్స్ కోసం మెయిల్ ఐడి, వాట్సప్ నంబర్‌ను కూడా షేర్ చేశారు. ఒక యాక్టింగ్ వీడియో, మూడు ఫోటోలని rc16bb.casting@gmail.comకి మెయిల్ చేసేయండి అంటూ ప్రకటించారు. కాబట్టి.. రామ్ చరణ్‌తో నటించే కొట్టేయాలంటే మేకర్స్ చెప్పిన పని చేసేయండి. ఇకపోతే.. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉంది. అయితే.. ఈ సెన్సేషన్ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేసే పనిలో ఉన్నాడట రెహమాన్. మరి ఆర్సీ 16 ఎలా ఉంటుందో చూడాలి మరి.