ఇకపై రూ.2 వేల నోట్లు చెల్లవంటూ ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు పార్టీలు రూ.2 వేల నోటును నిషేధించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆర్బీఐ ఆ నోట్ల చెలామణిని ఆపేసింది. తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను దగ్గర్లోని బ్యాంకుల వద్దకు వెళ్లి మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా నటుడు వెన్నెల కిషోర్ ఇంట్లో రూ.2 వేల నోట్లు గుట్టలుగా ఉండటాన్ని ఫోటో తీసి మంచు విష్ణు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్బీఐ 2000 నోట్లను రద్దు చేసిన తర్వాత విష్ణు మంచు ట్వీట్ చేశారు. వెన్నెల కిషోర్ గారి ఇంటికి వెళ్లినప్పుడు ఆ 2000 నోట్ల కట్టల గుట్టలను ఫోటో తీసుకున్నానని మంచు విష్ణు తెలిపారు.
అయితే ఆ నోట్లకు సంబంధించి తనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వెన్నెల కిషోర్ ఆ నోట్లను ఏం చేస్తాడో అనే ఫీలింగ్ కలుగుతోందని కామెంట్స్ చేశాడు. వెన్నెల కిషోర్ ఇంట్లో 2000 నోట్లు గుట్టలుగా ఉండటాన్ని మంచు విష్ణు షేర్ చేయడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తమకు ఓ కట్ట నోట్లు ఇవ్వాలని ఒక కామెంట్స్ చేస్తే మరొకరు ఐటీ వాళ్లు వచ్చేస్తారని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది.