Cannes Film Festival:కేన్స్ 76వ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) ఫ్రాన్స్ వేదికగా జరుగుతోంది. రెడ్ కార్పెట్‌పై సినీ సెలబ్రిటీలు, మోడల్స్, డిజైనర్లు హోయలు పోతుంటారు. ఈ సారి కూడా సందడి చేశారు. భారత్ నుంచి కూడా పలువురు ప్రముఖులు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లారు.
ఎప్పటిలాగే ఈసారి కూడా ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai) వెళ్లారు. ఆమె కూతురు ఆరాధ్యను వెంట పెట్టుకొని వచ్చారు. సారా అలీఖాన్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, ఊర్వసి రౌతెలా, ఈశా గుప్తా, మానుషి చిల్లర్ పాల్గొన్నారు. డిజైనర్ దుస్తుల్లో క్యాట్ వాక్ చేస్తే.. ఫోటోలకు ఫోజులిచ్చారు.
ఐశ్వర్య (Aishwarya) డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో డిజైన్ చేసిన డ్రెస్ వేసుకున్నారు. మృణాళ్, ఈశా శ్వేత వర్ణ వస్త్రాల్లో మెరిశారు.