ప్రముఖ టీవీ రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ రియాల్టీ షోలో కేవలం ఫేమ్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. వారందరిని ఒకే గదిలో ఉంచి, వారికి కొన్ని టాస్కులు ఇచ్చి, వారిని ఆడిస్తారు. ఇటివల మొదలైన కొత్త సీజన్ ఫుల్ జోష్‌లో కొనసాగుతుంది. కొత్తగా ఈ షో సరికొత్త రికార్డును సాధించింది.
బిగ్ బాస్ షోలు ఇప్పటి వరకు తెలుగులో ఆరు సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. అయితే, ఆరో సీజన్ పెద్దగా ఎక్కువ మందిని ఆకట్టుకోలేకపోయింది. చాలా ట్రోల్స్ వచ్చాయి. అందుకే ఈ సారి ఏడో సీజన్ లో ఆ పొరపాట్లు జరగకుండా ఉండేందుకు, విపరీతమైన ట్విస్ట్ లుపెట్టారు. చాలా డిఫరెంట్ గా ఈ సీజన్ సాగుతోంది. అందుకే ఈ సీజన్ అందరికీ విపరీతంగా నచ్చేస్తోంది. బిగ్ బాస్ 7 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రికార్డు స్థాయిలో 3 కోట్ల వీక్షకులను సంపాదించుకుంది. ప్రేక్షకులు కురిపించిన విపరీతమైన ప్రేమను ఈ సంఖ్య చూపిస్తుంది. ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బిగ్ బాస్ 7(Bigg Boss 7) ఎపిసోడ్‌ని వీక్షించినట్లు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నివేదికలు చెబుతుండటం విశేషం. స్టార్ మా లేదా రియాలిటీ షోకి ఈ విధమైన ప్రేమ కొత్త కానప్పటికీ ఈ సీజన్ ఖచ్చితంగా మునుపటి వాటి కంటే ప్రత్యేకంగా నిలిచిందని తెలుస్తోంది. షోకి ఇది ప్రశంసనీయమైన విజయం. అయితే మొదటి వారం మొత్తం వీక్షకుల సంఖ్య 5.1 కోట్లకు చేరుకుంది. తెలుగు ఛానెల్‌లలో మా టీవీ నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసింది.
షో హోస్ట్ నాగార్జున అక్కినేని(akkineni nagarjuna) ప్రోమోలో ఈ సీజన్ అనేక మలుపులు ఉన్నాయని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఇది షోపై అంచనాలను మరింత పెంచింది. మొదటి వారంలో వచ్చిన రెస్పాన్స్ చూసి రాబోయే ఎపిసోడ్లలో సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ షో కేవలం స్టార్ మాలోనే కాకుండా డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్‌లో ప్రేక్షకుల ప్రేమను పొందుతుండటం విశేషం.