ప్రస్తుతం అన్‌స్టాపబుల్ 2తో సందడి చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ(balakrishna). ఇక అఖండ తర్వాత గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108వ సినిమా చేయబోతున్నారు బాలయ్య. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. త్వరలోనే రెగ్యూలర్ షూట్‌కి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
ఇందులో బాలయ్య కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీలా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది. ముందుగా ‘బ్రో.. ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ పెట్టినట్టుగా జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరో కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. ఈ సినిమాకి ‘రామారావు గారు’ అని టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ఈ టైటిల్ అదిరిపోయేలా ఉందంటున్నారు బాలయ్య అభిమానులు.
త్వరలోనే దీని పై క్లారిటి రానుందని అంటున్నారు. ఇకపోతే.. ఈ సినిమా తర్వాత బాలయ్య మరో ఇద్దరు దర్శకులను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. రీసెంట్గా జరిగిన ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నట్టు దర్శకుడు పరశురామ్(parashuram) చెప్పుకొచ్చాడు. దాంతో బాలయ్య 109వ సినిమా ఇదేనని అంటున్నారు. ఇక ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఓ ప్రాజెక్ట్ ఉంటుందని టాక్. మొత్తంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపేందుకు రెడీ అవుతున్నారు బాలయ్య.