బాలయ్య హోస్టింగ్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 షో.. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక పై మరో లెక్క అన్నట్టుగా మారబోతోంది. ఫస్ట్ సీజన్లో స్టార్ హీరోలతో సందడి చేసిన బాలయ్య.. ఈ సారి పొలిటికల్ టచ్ ఎక్కువగా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఈ షోకి వస్తున్నాడని తెలియడంతో.. ఆ సమయం కోసం అభిమానులతో పాటు సదరు ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బాలయ్య, ప్రభాస్ ఇద్దరినీ ఒకే వేదిక పై చూడడానికి తహతహలాడుతున్నారు. తాజాగా ఫ్యాన్స్ చేసిన హంగామా చూస్తుంటే.. ఈ టాక్ షో నెక్ట్స్ లెవల్లో ఉండబోతోందని చెప్పొచ్చు. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. ప్రభాస్ పై ఒక స్పెషల్ AVని షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త ముందుగానే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవడంతో.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి చేరుకొని సందడి చేశారు.. బైక్ ర్యాలీలు చేస్తూ హంగామా చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. జస్ట్ ఏవికే ఇలా ఉంటే.. ఇక ఫుల్ ఎపిసోడ్ షూట్ అయితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఫుల్ ఎపిసోడ్‌ను డిసెంబర్ 11న షూట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ ఏవితో ‘ఆహా’ త్వరలోనే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ మోస్ట్ అవైటేడ్ ఎపిసోడ్.. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 30న, ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్. ఈ షోలో ప్రభాస్‌తో పాటు హీరో గోపీచంద్ కూడా రాబోతున్నాడు. ప్రభాస్, గోపీచంద్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. దాంతో అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్లో ప్రభాస్ ఎపిసోడ్ హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు.