జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్’ వెండితెరపై ఓ అద్భుతం అని చెప్పొచ్చు. 2009లో వచ్చిన అవతార్ మూవీ సంచలనం సృష్టించింది. ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. దాంతో ఈ మూవీ సీక్వెల్‌గా వస్తున్న ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ పై ఎక్కడ లేని అంచనాలున్నాయి.
డిసెంబర్ 16న ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన అవతార్ 2 టీజర్, ట్రైలర్‌లోని స్టన్నింగ్ విజువల్స్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక తాజాగా అవతార్ 2 ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసేలా ఉంది.
కళ్లు మిరిమిట్లు గొలిపే విజువల్స్ ఇందులో చూపించారు. ముఖ్యంగా ఈసారి భారీ స్థాయిలో ఉన్న యాక్షన్ ఎలిమెంట్స్ చూపించారు. అలాగే నీటిలోభీకర యుద్ధం జరగబోతున్నట్టు కొత్త ట్రైలర్‌తో మరోసారి చెప్పారు. నీటి అడుగున ఉండే వింత జీవులు.. సముద్రంపై పండోరా ప్రయాణం.. యుద్ధ దృశ్యాలు అంతకు మించి అనేలా ఉన్నాయి.
సరికొత్త విజువల్స్‌తో పాటు తమ తెగని కాపాడుకునే క్రమంలో.. జరిగే యుద్ధ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇలాంటి విజువల్ వండర్‌ను బిగ్ స్క్రీన్ మీద.. అది కూడా 3డీలో చూస్తే ఆ అనుభూతే వేరంటున్నారు మేకర్స్. మొత్తంగా అవతార్ 2 కొత్త ట్రైలర్ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు. మరి అంచనాలను పెంచేస్తున్న అవతార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.