Animal Movie: ఫస్ట్ డే అదరగొట్టిన ‘యానిమల్’ కలెక్షన్స్!
డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది యానిమల్ సినిమా. భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన యానిమల్.. ఫస్ట్ డే కలెక్షన్స్‌తో అదరగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టి.. సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ యానిమల్.. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 1న ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమా కోసం 200 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు మేకర్స్. అందుకు తగ్గట్టే భారీ బిజినెస్ చేసింది యానిమల్. దాదాపు 210 కోట్ల టార్గెట్‌తో ఈ సినిమా రిలీజ్ అయింది. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది యానిమల్. అడ్వాన్స్ బుకింగ్స్‌తో అదరగొట్టిన యానిమల్.. ఫస్ట్ డే వంద కోట్లను ఈజీగా టచ్ చేస్తుందని లెక్కలు వేశాయి ట్రేడ్ వర్గాలు.
అనుకున్నట్టుగానే డే వన్ 116 కోట్లు కొల్లగొట్టినట్టుగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఒక్క ఇండియాలోనే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని అంటున్నారు. హిందీలో 50 కోట్లు, తెలుగులో 10 కోట్లు, తమిళ్, కర్నాటక, కేరళ కలుపుకొని.. మొత్తంగా మొదటి రోజు 60 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లు తెలిసింది దీంతో రణ్‌బీర్ కపూర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది యానిమల్. అలాగే హిందీలో 2023లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో 3వ స్థానంలో నిలిచింది.
సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. వీకెండ్ వరకు యానిమల్దే హవా. ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా.. బాబీ డియోలే విలన్‌గా నటించాడు. ఈ సినిమాతో అసలు సిసలైన వైలెన్స్ ఎలా ఉంటుందో చూపించాడు సందీప్ రెడ్డి. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేయనున్నాడు సందీప్. నెక్స్ట్ ఇయర్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.