అల్లు అర్జున్ ఏం చేసిన స్పెషల్‌గానే ఉంటుంది. సినిమాలే కాదు నిజ జీవితంలోను బన్నీ ప్రత్యేకతను చాటుతుంటాడు. పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నాడు. అయితే రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను బన్నీ హీరోనే. ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని నిరూపించాడు బన్నీ. తాజాగా ఓ రెండు విషయాల్లో బన్నీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. కేరళకు చెందిన ఓ నర్సింగ్ అమ్మాయికి అండగా నిలబడ్డాడు బన్నీ. స్టడీస్‌లో టాప్ అయినప్పటికీ.. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న ఓ నర్సింగ్ స్టూడెంట్‌ని దత్తత తీసుకున్నాడు. అక్కడి కలెక్టర్ బన్నీని సంప్రదించడంతో.. నాలుగేళ్ల పాటు ఆ అమ్మాయి చదువు, హాస్టల్ ఫీజులకు కావాల్సిన సాయం చేయడానికి ముందుకొచ్చాడు బన్నీ. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగానే.. డ్రైవర్ విషయంలోను బన్నీ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు. తన దగ్గర పని చేసే ప్రతి ఒక్కరికి కూడా అల్లు అర్జున్ ఏదో ఓ విధంగా సపోర్ట్‌గా ఉంటునే ఉంటాడు. గతంలో ఈ విషయం చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇండస్ట్రీలో బన్నీ సన్నిహితులు ఈ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతునే ఉంటారు. తాజాగా తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌కు ఇల్లు కట్టుకునేందుకు సహాయం చేశాడట బన్నీ. దాదాపు 10 ఏళ్లుగా తన దగ్గర నమ్మకంగా వర్క్ చేస్తున్న డ్రైవర్‌కు.. హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకునేందుకు 15 లక్షల రూపాయల వరకు సహాయం చేశాడట. బన్నీ తన డ్రైవర్ సొంతింటి కల నెరవేర్చడంతో.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మరింది. మొత్తంగా మరోసారి బన్నీ తన ఔదార్యాన్ని చాటుకున్నాడని అంటున్నారు.