»Aishwarya Rajeshs Dear Shooting Complete Theatrical Rights Owned By Romeo Pictures
DEAR: ఐశ్వర్య రాజేష్ ‘డియర్’ షూటింగ్ పూర్తి..థియేట్రికల్ రైట్స్ రొమియో పిక్చర్స్ సొంతం
ఐశ్వర్య రాజేష్, జి.వి.ప్రకాష్ కలిసి నటిస్తున్న 'డియర్' మూవీ థియేట్రికల్ రైట్స్‌ను రొమియో పిక్చర్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు చేసుకుంటోంది. త్వరలోనే విడుదల కానుంది.
ఐశ్వర్య రాజేష్ (Aiswarya Rajesh), జీవీ ప్రకాష్ (GV Prakash) జంటగా నటిస్తున్న చిత్రం డియర్ (Dear Movie). ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ (Director Anand Ravichandran) దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తమిళనాడు (Tamilnadu) థియేట్రికల్ రైట్స్‌ను రొమియో పిక్చర్స్ (Romeo Pictures) సొంతం చేసుకుంది.
డియర్ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియో:
డియర్ మూవీ (Dear Movie) షూటింగ్ 2022లో ప్రారంభం కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకుంటోంది. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ దీపిక అనే పాత్రలో కనిపించనుంది. జి.వి.ప్రకాష్..అర్జున్ అనే పాత్రలో కనిపించనున్నాడు. మూవీలో ఐశ్వర్య రాజేష్ ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటుందని, ఆమె చేసే గురక శబ్దానికి జి.వి.ప్రకాష్ నిద్రపోలేకపోతుంటాడని మోషన్ పోస్టర్ (Motion Poster)ను చూస్తేనే తెలుస్తోంది.