»Actress Payal Ghosh Wants To Marry Indian Pace Bowler Mohammad Shami
Payal Ghosh: షమీతో పెళ్లికి రెడీ అంటున్న బాలీవుడ్ హీరోయిన్
భారత్ ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీని బాలీవుడ్ నటీ, రాజకీయ నాయకురాలు పాయల్ ఘోష్ పెళ్లి చేసుకుంటానని అంటోంది. అంతేకాదు అందుకో కండీషన్ పెట్టింది. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.
Actress Payal Ghosh wants to marry Indian pace bowler Mohammad Shami
Mohammad Shami: ప్రస్తుతం వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023)2023 జోరు నడుస్తుంది. ఈ టోర్నీలో భారత జట్టు ఎంతో పటిష్టంగా ఉంది. ఇక పేసర్ షమీ (Mohammed Shami) ఫార్ఫార్మెన్స్ మాములుగా లేదు. ఈ టోర్నీలో ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా ప్రతి ఆటలో విజృంభించిన తీరుకు అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటివరకు 16 వికెట్లు తీశాడు. అందులో రెండు మ్యాచ్‌లలో ఐదేసి వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అందుకే దేశమంతట షమీ హాట్ టాపిక్‌గా మారాడు. ఈ తరుణంలో బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ (Payal Ghosh) షమీకి ఫ్యాన్ అవడమే కాకుండా అతన్ని పెళ్లి కూడా చేసుకుంటానని అంటుంది. దీని గురించి ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఎక్స్ వేదికగా పేర్కొంది.
షమీ (Mohammed Shami)ని పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రాసుకొచ్చింది. అలాగే తనకో షరతు పెట్టింది. ఈ పేసర్ ఇంగ్లీష్‌ను అనర్గళంగా మాట్లాడితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమకు భాషతో సంబంధం ఏంటి అని కొందరు అంటుంటే, దీనిపై షమీ ఎలా స్పందిస్తాడో అని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలైన పాయల్ ఘోష్ మంచు మనోజ్ జోడిగా ప్రయాణం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తరువాత కొన్ని సినిమాల్లో కనిపించి బాలీవుడ్‌కు మకాం మార్చింది. 2020లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం రామ్‌దాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉపాధ్యక్షురాలిగా కీలక పదవిలో ఉంది. ఇక షమీ 2014లో హసీన్ జహాన్‌ను మ్యారెజ్ చేసుకున్నాడు. తరువాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి కోర్టు కెక్కారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు విచారణలో ఉంది.