రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నారు. గోదారి బ్యాక్డ్రాప్లో రూరల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు కీర్తి సురేష్ కూడా కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.