NTR: నగరంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే లక్ష్యంతో “విజయవాడ ఉత్సవ్”ను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. గొల్లపూడి సమీపంలోని మైదానంలో తుది దశకు చేరిన ఎగ్జిబిషన్ ఏర్పాట్లను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎగ్జిబిషన్ ఏర్పాటు సంకల్పించినట్లు తెలిపారు.