SRCL: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో రాయికంటి రాజయ్య( 56 ) అనే వ్యక్తి ఊరివేసుకుని బలవన్మరణం చెందాడు. రాజయ్య కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే వాడని. కొంత కాలంగా బీపీ వ్యాధితో బాధపడుతు.. మద్యానికి బానిసై శనివారం రాత్రి ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనను ఆదివారం కుటుంబ సభ్యులు గమనించి, పోలీసులకు పిర్యదు చేశారు.