ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన మరణంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ప్రముఖ సినీ నటుడు తిరు ఢిల్లీ గణేష్ నటించిన ప్రతి పాత్ర, నటనా స్పూర్తిని తరతరాల వీక్షకులు ప్రేమగా గుర్తుంచుకుంటారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి.. ఓం శాంతి’ అని మోదీ ‘X’లో రాసుకొచ్చారు.