శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోగ్రఫీ ఆధారంగా వచ్చిన చిత్రం 800. ఇది నేడు(అక్టోబర్ 6న) తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్వయంగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించడంతో క్రికెట్, సినీ ఔత్సాహికుల్లో ఈ మూవీపై మరింత ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
సినిమా – 800 నటీనటులు – మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నారాయణ్, నాజర్, అరుల్దాస్, తదితరులు దర్శకత్వం – ఎంఎస్ శ్రీపతి
రచన – MS శ్రీపతి & షెహన్ కరుణతిలక నిర్మాణం- ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంగీతం – జిబ్రాన్ సినిమాటోగ్రాఫర్ – RD రాజశేఖర్ విడుదల తేదీ –అక్టోబర్ 6, 2023
కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, M.S ధోనీ వంటి ప్రముఖ క్రికెటర్ల జీవితాల గురించి ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా నేడు(అక్టోబర్ 6న) ప్రముఖ శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్(Muttaih Muralitharan) స్ఫూర్తిదాయకమైన కథ 800 రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు చుద్దాం.
కథ
ఈ కథ శ్రీలంకకు చెందిన క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ జీవితం గురించి తెలియజేస్తుంది. ఇది శ్రీలంకలో జాతి ఉద్రిక్తతల కారణంగా అతని కుటుంబం ఎదుర్కొన్న కష్టాలతో సహా అతని వ్యక్తిగత, క్రీడాపరమైన వృత్తిపరమైన అనుభవాలను తెలియజేస్తుంది. ఈ మూవీలో అంతర్జాతీయ క్రికెట్లోకి ముత్తయ్య ప్రవేశించడానికి ముందు, ఆ తర్వాత తర్వాత అతను ఎదుర్కొన్న పరిస్థితులు, కీలక సంఘటనలు అతని ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ చుట్టూ ఉన్న వివాదాలను కూడా ఈ చిత్రంలో చూడవచ్చు. అంతేకాదు ముత్తయ్యకు క్రికెట్ పై మక్కువ ఎందుకు కలిగింది? 800 వికెట్ల కృషి ఎలా సాధ్యమైంది? వంటి అనేక విషాయాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మురళీధరన్ తన కలలు ఎలా నెరవేర్చుకున్నాడు. ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు. వంటి ఈ ఆటగాడి జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించారు. ఈ సినిమాలో మురళీధరన్ జీవితంలోని అనేక కోణాలను ప్రస్తావించారు. మురళి క్రికెట్లో ఓదార్పుని పొందడం, రౌడీలకు ఎదురొడ్డి నిలబడడం, ఒక ఉత్తేజకరమైన పేస్ బౌలర్ నుంచి క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఎలా రూపాంతరం చెందాడో కూడా ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రం రాజకీయ సమస్యలను కూడా ప్రస్తావించింది. తమిళులు, సింహళీయుల మధ్య సంఘర్షణ, తీవ్రవాద దాడులు, జాతీయత సమస్య వంటి అనేక సమస్యలను ప్రస్తావించారు. రెండు భాగాలు కొంచెం స్లోగా ఉన్నప్పటికీ అధిక ప్రభావం చూపించే సీన్లు సహా కొన్ని చోట్ల ఎమోషనల్ డెప్త్ కనిపించదు. మొత్తంగా ముత్తయ్య క్రికెట్ కెరీర్ కంటే అతని వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా చెప్పినట్లు అనిపిస్తుంది.
ఎవరెలా చేశారు?
ఇక మురళీధరన్ పాత్రకు మాధుర్ మిట్టల్ చేసిన పాత్ర పర్వాలేదు. ఎందుకంటే అతను పాత్రకు నిష్కళంకమైన ఖచ్చితత్వంతో జీవం పోశాడు. భావోద్వేగాలలో అతని నైపుణ్యం చక్కగా చూపించాడు. దాదాపుగా అచ్చం ముత్తయ్య మాదిరిగా బాడీ లాంగ్వేజ్‌తో నిజంగా మెప్పించారు. కానీ కొన్ని చొట్ల మిట్టల్ కష్టాలు, బాధలు ఆరోపణలు వచ్చినప్పుడు నిరాశ, కోపాన్ని సమర్థవంతంగా చూపించలేకపోయారనిపిస్తుంది. ఇక ఇతర సహాయక నటీనటులలో నాజర్, వేల రామమూర్తి, కింగ్ రత్నం పాత్రికేయుడిగా, తండ్రిగా శ్రీలంక కెప్టెన్ రణతుంగగా తమ తమ పాత్రలలో మెచ్చుకోదగిన నటనను ప్రదర్శించారు. మురళీధరన్ భార్యగా మహిమా నంబియార్ పరిమిత పాత్రను కలిగి ఉన్నప్పటికీ ఆమె తన స్క్రీన్ టైమ్‌ను గుర్తించదగిన పాత్రతో మెప్పించింది.
సాంకేతిక అంశాలు
రచయితగా, దర్శకుడిగా ఎం.ఎస్. శ్రీపతి ఈ చిత్రాన్ని పూర్తిగా తనపైవే వేసుకున్నాడు. బయోపిక్‌ని రూపొందించడంలో, ప్రసిద్ధ బౌలర్‌ను చక్కగా చూపించడంలో శ్రీపతి మరింత మెరుగ్గా పని చేసి ఉండవచ్చనిపిస్తుంది. జిబ్రాన్ తన సంగీతం ద్వారా సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో కొన్ని చోట్ల నిరాశ పరిచారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ పర్వాలేదు. అయితే సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయని అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
+మధుర్ మిట్టల్ యాక్టింగ్
+నాసర్ పాత్ర
+భావోద్వేగాలు