నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. సినీ పరిశ్రమలో 50 ఏళ్లుగా ప్రేక్షకులను అలరించడం, బసవతారకం ఆస్పత్రి ద్వారా ఆయన చేస్తున్న సేవలకుగానూ UKలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ గుర్తింపును ఇచ్చింది. దీంతో ఇండియన్ సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా బాలయ్య నిలిచారు. ఈ నెల 30న హైదరాబాద్లో జరగనున్న కార్యక్రమంలో బాలయ్యను సత్కరించనున్నారు.