ప్రభాస్ ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణెను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో సినిమాలోని ‘సుమతి’ పాత్రలో ఎవరు నటిస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మేకర్స్ కొత్త నటిని వెతికే పనుల్లో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే సుమతి పాత్రలో అనుష్క బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ అంటుండగా.. నయనతార, సమంత, అలియా భట్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.