కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీకైన విషయం తెలిసిందే. దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తూ ఓ లేఖ విడుదల చేసింది. ‘మా ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడుతున్న సమయంలో ఈ లీక్ మాకు చాలా బాధను కలిగించింది. ఈ లీక్ మా కష్టాన్నే కాదు.. ఈ చిత్రం కోసం నిరంతరం శ్రమించే 2 వేల మంది కష్టాన్ని వృధా చేసింది. దీన్ని షేర్ చేసిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి. ఈ లీక్ చేసిన వ్యక్తిని కనిపెట్టిన వారికి రూ.5 లక్షల బహుమతి ఇస్తాం’ అని లేఖలో పేర్కొంది.