‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. హీరోలు అలాంటి టైంలో వెళ్లడం కరెక్టేనా అని నిలదీశారు. ఘటనపై హీరో కానీ, చిత్ర యూనిట్ కానీ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. బాధితురాలి కుటుంబాన్ని హీరో, ప్రొడ్యూసర్స్ ఆదుకోవాలని.. బాధితులకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.