ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తాజాగా మరో కొత్త సినిమాను ప్రారంభించింది. యువ నటుడు అశోక్ గల్లా హీరోగా ప్రొడక్షన్ నెం.27 చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా సినీ ప్రముఖల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. నమ్రత ఘట్టమనేని ఫస్ట్ క్లాప్ ఇవ్వగా, పద్మ గల్లా, మంజుల స్వరూప్ తమ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.