గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త రోల్స్ రాయిస్ కారుకు TG 09C 2727 నంబర్‌ను రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే ఈ నంబర్ వెనుక సీక్రెట్ ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ పుట్టినరోజు మార్చి 27 కాబట్టి ఆ డేట్‌ను నంబర్ ప్లేట్లో రెండు సార్లు వచ్చేలా చూసుకున్నాడని తెలుస్తోంది. పుట్టినరోజు అంటే సెంటిమెంట్ కాబట్టి మిగతా కార్లకు కూడా 27 నంబర్‌నే చెర్రీ కొనసాగిస్తున్నట్లు సమాచారం.