‘దానా’ తుపాను హెచ్చరికలతో పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఈ నెల 23న 18 రైళ్లు, 24న 37 రైళ్లు, 25న 11 రైళ్లు రద్దయ్యాయి. 23న సికింద్రాబాద్-భువనేశ్వర్-విశాఖ(17016) ఎక్స్ప్రెస్, 24న గునుపూర్-విశాఖ ప్యాసింజర్(08521), పలాస-విశాఖ మెము రైలు(07471), విశాఖ-భువనేశ్వర్ వందేభారత్(20842), విశాఖ-దిఘా ఎక్స్ప్రెస్(22874) రద్దు అయినట్లు రైల్వేశాఖ తెలిపింది.