AP: గుంటూరులో సాఫ్ట్వేర్ కంపెనీ పేరిట మోసం చేసిన విషయం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరిట డెవలప్-3 సంస్థ డిపాజిట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. బాధితుల నుంచి రూ. లక్షల్లో కంపెనీ వసూలు చేసింది. రూ. కోట్లు వసూలు చేసి పరారైనట్లు బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అరండల్పేట పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.