AP: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై కేసు నమోదు అయింది. అంగన్వాడీలను దూషించి బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. 2023 డిసెంబర్ 27న అంగన్వాడీల ఆందోళన సందర్భంగా ఘటన జరిగినట్లు తెలుస్తుంది. బొల్లా బ్రహ్మనాయుడిపై సీఐటీయూ నేత హనుమంతరెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని జులై 31న కోర్టు ఆదేశాలు ఇవ్వగా.. సెప్టెంబర్ 23న పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.