గుంటూరు మంగళగిరిలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 93 గ్రూప్ -ఏబీసీ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు www.aiimsmangalagiri.edu.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ -ఏ పోస్టులకు ఆఫ్ లైన్, గ్రూప్ -బీ, సీ పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 29 అక్టోబర్ 2024 దరఖాస్తుకు చివరి తేదీ.