దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బంగారం ధరలు ఒకేలా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ తెలిపింది. ‘వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్’ అమలు కోసం కృషి చేస్తున్నామని వెల్లడించింది. ‘వ్యాపారులు ఒకే రేటుతో బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. కానీ రిటైల్ ధరలు మాత్రం నగరానికి నగరానికి మధ్య భిన్నంగా ఉంటాయి. దీన్ని మారుస్తూ దేశవ్యాప్తంగా ఒకే ధర ఉండాలని భావిస్తున్నామని’ తెలిపింది.