కర్తార్‌పుర్ కారిడార్‌కు సంబంధించి భారత్, పాక్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నడవాపై ఉన్న ఒప్పందాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు అంగీకరించినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. అంతేకాకుండా ఈ నడవాను ఉపయోగించుకునే భక్తులపై ఎలాంటి రుసుము విధించవద్దని పాక్‌ను కోరినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.