BPT: బాపట్ల సాల్వేషన్ ఆర్మీ ఐటీఐ కళాశాలలో ఈ నెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రణయ్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని 100కు పైగా పోస్టులను భర్తీ చేస్తారన్నారు. జాబ్ మేళాకు 10, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, MBA, పీజీ విభాగాలకు చెందిన 18 నుంచి 32 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు హాజరు అవ్వాలన్నారు.