TG: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మలేషియా పర్యటనలో భాగంగా కౌలాలంపూర్‌కు చేరుకున్నారు. ఆయిల్ పామ్ సాగుపై మలేషియాలో మూడు రోజుల పాటు స్టడీ టూర్ నిమిత్తం మంత్రి అక్కడికి వెళ్లారు. ఆ క్రమంలో ఇవాళ మలేషియా మంత్రి జోహారి ఘనీతో భేటీ కానున్నారు. అనంతరం ఆయిల్స్ అండ్ ఫాట్స్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్ సందర్శించనున్నారు. అక్కడ హార్వెస్టింగ్ టూల్స్ డెమోను అధికారులతో కలిసి పరిశీలించనున్నారు.