ప్రకాశం: కనిగిరి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలను కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన వైద్యశాలలో అందుతున్న సేవలు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. దాతల సహకారంతో ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.