ఇప్పటికే పలురంగాల్లో అడుగుపెట్టి దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ నిలిచారు. అయితే ప్రస్తుతం ఆయన బీమా రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ మేరకు అలియాంజ్ ఎస్ఈతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ చర్చలు జరిపింది. కాగా, జర్మనీకి చెందిన బీమా దిగ్గజం అలియాంజ్, దేశంలో బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్‌తో ఇప్పటికే ఉన్న రెండు జాయింట్ వెంచర్ల నుంచి వైదొలగాలని చూస్తోంది.