NLR: ఉదయగిరి, వరికుంటపాడు మండలాల్లో తుఫాన్ ప్రభావం కారణంగా ఇటీవల కురిసిన వర్షాలకు పలు చెక్ డ్యామ్‌లలో జలకళ సంతరించుకుంది. ఫలితంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యామ్‌ల సమీపంలోని బోర్లలో భూగర్భజలాల నీటిమట్టం పెరిగినట్లు తెలిపారు. దీంతో సాగుకు రైతులు ఉపక్రమిస్తున్నారు.