ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్యాష్(కొట్టివేయాలని) చేయాలని నటుడు అల్లు అర్జున్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా, నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.