NRML: దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి గ్రామాన్ని ఎంపీఓ గోవర్ధన్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పంచాయతీలోని అన్ని రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు విషయాలు సూచించారు.