సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల కోసం ఐర్లాండ్ సరికొత్తగా బ్యాచిలర్ డిగ్రీని తీసుకొచ్చింది. సౌత్ ఈస్ట్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ‘కంటెంట్ క్రియేషన్ అండ్ సోషల్ మీడియా’ అనే నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టింది. ఇందులో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎలా ఫాలోవర్స్‌ను పెంచుకోవాలి, ఎలాంటి వీడియోల ద్వారా డబ్బులు త్వరగా సంపాదించగలమనే వివిధ అంశాలను విద్యార్థులకు బోధించనున్నారు.