NDL: సంజామల మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఖాళీగా ఉన్న ఒక అంగన్వాడీ కార్యకర్త(SC), ఆయా(BC-D) పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు దరఖాస్తు గడువు పెంచినట్లు CDPO ఉమామహేశ్వరమ్మ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, వివాహితులైన 21 నుంచి 35 సం.లోపు మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.