MDK: హవేలీఘన్పూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన మంజుల 108 వాహనంలో పురుడు పోసుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మంజులను మెదక్ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటి నవీన్ యాదవ్ వాహనంలోనే సాధారణ ప్రసవం చేశారు.