త్వరలో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆల్రౌండర్లు కీలకం కానుండడంతో జట్టులో ఎవరిని ఎంపిక చేస్తారనే సందిగ్ధత నెలకొంది. గత కొంతకాలంగా టెస్టులకు దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్యాను ఈ సిరీస్కు ఎంపిక చేస్తారా?.. ఒకవేళ చేస్తే తెలుగు కుర్రాడు నితిశ్ కుమార్కు అవకాశం లభిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. వీరితో పాటు శార్దుల్ ఠాకూర్ కూడా పోటీలో ఉండటంతో BCCI ఎంపిక చేసే జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందో వేచి చూడాలి.