కంటోన్మెంట్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ విజయ్ ఆనంద్‌కు ఇటీవల బేగంపేట్ కిమ్స్-సన్ షైన్ హాస్పిటల్లో హార్ట్ సర్జరీ జరిగింది. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాస్పిటల్‌కి వెళ్లి విజయ్ ఆనంద్‌ను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు.