TG: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఇన్ ఫ్లో 30,000, అవుట్ ఫ్లో 26,978 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.020 మీటర్లు ఉంది. కాగా, జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.