ఇవాళ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్దఎత్తున ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఇందులోభాగంగా సోషల్ మీడియాలో ఆయనకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో ప్రభాస్ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది. ఇక అక్టోబర్ 23, 1979లో చెన్నైలో ప్రభాస్ పుట్టారు.