ఇంట్లో దోమల బెడదను నివారించడానికి దోమల కాయిల్స్ వాడుతుంటారు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాయిల్స్‌లో డేంజరస్ కెమికల్ ఉంటాయట. దీని వాసన పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. కాయిల్ వాసన పడనివారికి తలనొప్పి వస్తుంది. వికారం, స్కిన్‌పై దద్దుర్లు, కంటి సమస్యలు వస్తాయి. కాయిల్స్ పొగ.. సిగరెట్ పొగతో సమానమని చెబుతున్నారు. గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు దెబ్బతింటుందని అంటున్నారు.