ఒక రాష్ట్రానికి సీఎం అయినప్పటికీ తనకు ఇప్పటికీ సొంతిల్లు లేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. ముడా కుంభకోణంలో తన పాత్ర ఉందని విపక్షాలు ఆరోపిస్తున్న వేళ ఆ విషయంపై తాజాగా మరోసారి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. వెనకబడిన వర్గానికి చెందిన తాను రెండోసారి సీఎం కావడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతుందన్నారు. ఇప్పటి వరకు తాను నిజాయతీతో కూడిన రాజకీయాలు మాత్రమే చేశానని.. ప్రతిపక్షాలు చేసేవి తప్పుడు ఆరోపణలంటూ వాటిని తిప్పికొట్టారు.