ఇవాళ వయనాడ్లో ప్రియాంకా గాంధీ నామినేషన్ వేయనున్నారు. వయనాడ్ ఎంపీ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకోవటంతో అక్కడ జరిగే ఉపఎన్నికలో ప్రియాంక పోటీ చేస్తున్నారు. ఉదయం 10:30గంటలకు నామినేషన్ సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. కాగా, ప్రియాంకా గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు.