TG: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రభాస్ అభిమానులు హల్చల్ చేశారు. ఇవాళ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అర్థరాత్రి ఆయన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, అభిమానులకు వాగ్వాదం జరిగింది. ప్రభాస్‌ను కలవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. కాగా, ఆందోళనకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టారు.