తమిళ బిగ్బాస్ 8వ సీజన్ లాంచ్కు సిద్ధమవుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలతో టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. కొందరిని ఫైనల్ చేయగా మరికొందరికి ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరోవైపు షోలోకి వచ్చే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురు సెలబ్రెటీల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తాజాగా, ఆ జాబితాలో సీనియర్ నటుడు, కమెడియన్ సెంథిల్ పేరు వినిపిస్తోంది. సెంథిల్ తమిళంలోనే కాదు దక్షిణాది పరిశ్రమలోనూ ఈయనకు గుర్తింపు ఉంది.