ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమెకు మేకర్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చారట. ఈ పాట కోసం శ్రద్ధ ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్ చేసిందట. త్వరలోనే ఈ పాట షూటింగ్ జరగనున్నట్లు టాక్. ఇక ఈ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ కానుంది.