AP: కడప జిల్లా బద్వేల్లో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మరణం విషాదకరమని హోం మంత్రి అనిత విచారం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృతిచెందడం చాలా దిగ్భ్రాంతికరమన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని, అందుకు సహకరించిన వారికి శిక్షపడేలా చేస్తామని మంత్రి తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.